

పాటలు
Nee prajalu
Pallavi
నీ ప్రజలు చేసే స్తోత్రాల మీద ఆసీనుడై ఉండే దేవా (x2)
నిత్యమైన నీ కృపలో మమ్ము ఆశీర్వదించే దేవా (x2)
ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఆరాధనా (x2)Charanam 1
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని
అబ్రాహాముతో ప్రేమగా పలికితివి నెరవేర్చితివి (both lines x2)
నేడు కూడా మాతో ఉన్నావు మమ్మును ఆశీర్వదించుటకే (x2)
ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఆరాధనా (x2)Charanam 2
నీవు నడిచే మార్గమంతటిలో నీకు తోడై ఉంటానని
యెహోషువతో వాగ్దానముగా పలికితివి బలపరచితివి (both lines x2)
ఇమ్మానుయేలైన మా యేసు రాజా మాతో కూడా ఉన్నావయ్యా (x2)
ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఆరాధనా (x2)nannu vedhaki
Pallavi
నన్ను వెదకి నన్ను పిలచి
రక్షణ ఇచ్చిన నా యేసుని (both lines x2)
స్తుతించెదను పొగడెదను
ఆత్మతో నేను పాడెదను (both lines x2)
నన్ను వెదకి నన్ను పిలచి
రక్షణ ఇచ్చిన నా యేసునిCharanam 1
వీణానాద సహితముగా
నూతన గీతం పాడెదను
ఆ... ఆ... ఆ...
వీణానాద సహితముగా
నూతన గీతం పాడెదను
విరిగి నలిగిన హృదయముతో
నీ కీర్తిని నే చాటెదను (both lines x2)Charanam 2
స్తుతిగానాల భవనమును
ఆత్మలో నేను కట్టెదను
ఆ... ఆ... ఆ...
స్తుతిగానాల భవనమును
ఆత్మలో నేను కట్టెదను
కలతలు లేని నీ రాజ్యములో
కానుకగానే నర్పింతును (both lines x2)Aanati na
Pallavi
ఆనాటి నా పరిస్థితి వేరు
ఈనాడు నీవు నన్నుంచిన ఈ స్థితి వేరు (both lines x2)
యేసయ్యా యేసయ్యా
అందుకే ఈ స్తుతులయ్యా (both lines x2)Charanam 1
మరణకరమైన ఆ పరిస్థితులలో
మంచము పైన నేను పడియుండగా (both lines x2)
నాదు దరిచేరి నన్ను ఓదార్చి (x2)
కన్నతల్లివలె ఆదరించినావు (x2)Charanam 2
నూతన జీవితం ఎందుకు ఇచ్చావంటే
నిన్ను స్తుతియించుచూ నిన్ను ప్రకటించుచూ (both lines x2)
అంతము వరకు నీకు సాక్షిగా (x2)
పరిశుద్ధతతో నేనుండాలని (x2)Charanam 3
ఇన్ని కార్యాలను చేసిన యేసయ్యను
అన్ని సమయాలలో నేను మహిమపరతును (both lines x2)
శ్వాస ఆగిన విశ్వాసమాగదు (x2)
మరణించినా నిన్ను స్తుతియించుతా (x2)Thaal bajao Thaal bajao
Pallavi
ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे (x2)
Charanam 1
यीशु मेरे लिए बहुत अच्छा है (x2)
तक धिना धिन आहा आहा
तक धिना धिन ओहो ओहो (both lines x2)
Charanam 2
यीशु मेरे लिए रक्षण दिया है (x2)
तक धिना धिन आहा आहा
तक धिना धिन ओहो ओहो (both lines x2)
Charanam 3
यीशु मेरे लिए चंगा दिया है (x2)
तक धिना धिन आहा आहा
तक धिना धिन ओहो ओहो (both lines x2)yessaya neku saati
Pallavi
యేసయ్యా నీకు సాటి
వేరెవరూ లేరయ్యాCharanam 1
మూడు లోకాలలోన
ఒక్కరూ కనబడరయ్యాCharanam 2
శూన్యములోన సృష్టిని చేసావు
నీ పోలికలో మనిషిని చేసావు
నీ జీవముతో మనిషిని నింపి
శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావుCharanam 3
ఏ పాపమును ఎరుగని వాడవు
ఏ దోషమును చేయని వాడవు
కలువరి సిలువలో రక్తము కార్చి
నా పాప దోషములు క్షమించావుRandi prakatinchudham
Pallavi
రండి ప్రకటించుదాం రక్షణ సువార్తను
యేసయ్యే నిజ దేవుడని (x2)
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు (x2)Charanam 1
ఆదియందు వాక్యముండెను
వాక్యమే దేవుడైయుండెను
యేసు ప్రభువే వాక్యం
వాక్యమే సత్యం
సత్యమే మార్గం
మార్గమే జీవంCharanam 2
భూదిగంత నివాసులారా
సిలువలో యేసుని చూడండి
యేసుని రక్తములోనే
పాపక్షమాపణ మనకు
శాశ్వతమైన ప్రేమతో
మోక్షానికి నిను చేర్చునుNa manasantha
Pallavi
నా తనువంతా యేసయ్య నీవే
నా మనసంతా నీ దివ్య వాక్యమే
నా బ్రతుకంతా నీ నామ స్మరణే
నాలోని అణువణువు నీవే నీవే నీవేCharanam 1
నా గానానికి నా ధ్యానానికి ఆధారం నీవే
నా రాగానికి నా భావానికి అనువాదం నీవే
నీ ప్రేమ సూచనలో నే వొదిగిపోవాలి
నీ మహిమ సన్నిధిలో నే కలిసిపోవాలిCharanam 2
నీ ప్రేమను నీ ఓర్పును నే కలిగియుండాలి
నీ విశ్వాసము నీ నీతిని నే ననుసరించాలి
నీ ఆత్మ ఆదరణే నా కలిమి కావాలి
నీ ఆజ్ఞ ఆచరణే నా బలము కావాలిPachani Vanamu
Pallavi
పచ్చని వనము పుష్పాల సౌరభము
ప్రతి క్షణము నా యేసుతో (both lines x2)
మధురం మధురం ఆ ప్రియునితో (x2)
పచ్చని వనము పుష్పాల సౌరభము
ప్రతి క్షణము నా యేసుతో
Charanam 1
ప్రతి ఘడియ నాతో ఉండాలని
నా యేసుని హృదయాభిలాష (both lines x2)
యుగయుగాలు ఆ ప్రియునితో
ఉండాలనేది నా అభిలాష (both lines x2)
Charanam 2
నా యేసుని ప్రేమానురాగాలు
ఎంత మధురమో నా ఊహకందనిది (both lines x2)
నేను చూసిన ఒక్క చూపుతో
తన హృదయాన్ని నా వశము చేసెను (both lines x2)Its a great thing
Verse 1
It's a great thing to praise the Lord (x3)
Walking in the light of the Lord (both lines x2)
Chorus
So walk, walk, walk, walk in the light
Walk, walk, walk, walk in the light (x2)
Walking in the light of the Lord (these 3 lines x2)
Verse 2
It's a great thing to love the Lord (x3)
Walking in the light of the Lord (both lines x2)
Verse 3
It's a great thing to serve the Lord (x3)
Walking in the light of the Lord (both lines x2)
ఇతర ఆల్బమ్‌లు

























