

పాటలు
Anna's Testimony
Parisuddudu
Pallavi
పరిశుద్ధుడు పరిశుద్ధుడు (x2)
పరిశుద్ధుడూ అని నిత్యము దూతలతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా
నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా
వందనం ప్రభూ వందనం (x2)Charanam 1
సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా (x2)
గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును (x2)
గాన ప్రతిగానం చేసెద నేను (x2)Charanam 2
నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా (x2)
నా దేహమనే నీ ఆలయమందున (x2)
స్తుతి ధూపము వేసెద నిరతము నీకు (x2)Prema Kanikaramu
Pallavi
ప్రేమా కనికరము చూపావు నా జీవితంలో
నీ ప్రేమా కనికరము చూపావు నా జీవితంలో
హృదయ వేదన బాధలలో ఓదార్చినావు యేసయ్యా
హృదయ వేదన బాధలలో నను ఓదార్చినావు యేసయ్యా
ప్రేమా కనికరము చూపావు నా జీవితంలోCharanam 1
నా పాదములు తొట్రిల్లినప్పుడు నన్నాదుకున్నావు
నా విశ్వాసము కంపించినప్పుడు నను ధైర్యపరచావు (both lines x2)
కఠినమైన నా హృదయమును కన్నీటి ధారతో నింపావు (x2)Charanam 2
నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా ఇచ్చావు
నీ సన్నిధి నుండి నను త్రోసివేయక పరిశుద్ధాత్మను ఇచ్చావు (both lines x2)
కఠినమైన నా హృదయమును కన్నీటి ధారతో నింపావు (x2)Outro
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాYehova Namamunaku
Pallavi
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక (x2)
ప్రభువైన యేసు క్రీస్తునకు (x2)
మహిమ కలుగును గాక
పరిశుద్ధాత్మ దేవునికి
ఘనత కలుగును గాక (both lines x2)
ఆరాధనా ఆత్మ వేదనా
ఆరాధనా హృదయ రోదనాCharanam 1
ఉన్నత స్థలముల ప్రభువా
జీవాధిపతియైన దేవా (both lines x2)
ప్రేమ స్వరూపి కృపగల తండ్రి (x2)
ఆదరణ కర్త నా యేసయ్యా (x2)Charanam 2
భూలోకమునకు దేవా
పరలోకమునకు ప్రభువా (both lines x2)
అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా (x2)
యాకోబు దేవా నా దేవా (x2)Stuthi Ganamu
Pallavi
స్తుతి గానము నే పాడగా (x2)
నా ప్రభు యేసు నా దరి చేరెను (x2)Charanam 1
నాలోన తానే జన్మించెను
నను సేదదీర్చి కరుణించెను (both lines x2)
తనలోనేనై నాలో తానై (x2)
నిలిచియుండే కృపనిచ్చెనుCharanam 2
దినమెల్ల నీ నీతి వర్ణించనీ
నీ ప్రభావ వర్ణన వివరించనీ (both lines x2)
నా జీవితాన నీవు చేసిన
మేలులన్నీ తలపోయనీ (both lines x2)Outro
హల్లెలూయా హల్లెలూయా (x4)Premiunna
Pallavi
ప్రేమైయున్న యేసయ్యా
ప్రేమలో జీవించే కృపనివ్వు (both lines x2)
ప్రేమను నేను చూపనిచో (x2)
ప్రేమతో తీసుకో నా జీవితం
ప్రేమతో తీసుకో ఈ జీవితం
ప్రేమైయున్న యేసయ్యా
ప్రేమలో జీవించే కృపనివ్వుCharanam 1
కొండలను పెకలించే
విశ్వాసము నాకున్నను (both lines x2)
ప్రేమలేని వాడనైతే (x2)
వ్యర్థుడను నేను వ్యర్థుడనుCharanam 2
విశ్వాసము నిరీక్షణ ప్రేమ (x2)
ఈ మూడిటిలో శ్రేష్టమైనది (x2)
ప్రేమేలే నీ ప్రేమేAashaithe vundi nalo
Pallavi
ఆశైతే ఉంది నాలో
అందుకోలేకున్నాను
నా చేయి పట్టుకో నా రక్షకా
నా చేయి పట్టుకో నా యేసయ్యాCharanam 1
నీలోనే నేను నిలవాలని
నీ ఆత్మలో నేను నడవాలని
నీ రూపునే పొందుకోవాలని
నీ మనస్సు నాకిల రావాలనిCharanam 2
నీ ప్రేమనే కలిగి ఉండాలని
నీ ఫలము నాలో పండాలని
నీ కృపతో నా మది నిండాలని
ఆత్మాగ్ని నాలో మండాలనిCharanam 3
ఆనాటి పౌలులా బ్రతకాలని
ఆశ్చర్య కార్యాలు వెదకాలని
ఆత్మీయ శిఖరాలనెక్కాలని
అపవాదిని చిదుగ త్రొక్కాలనిAthmato Nimpava
Pallavi
ఆత్మతో నింపవా పరిశుద్ధాత్మతో నింపవా
అగ్నిని పంపవా పరిశుద్ధాగ్నిని పంపవా
నను దహించగా నశియించు ఆత్మల రక్షించగా
ఆత్మతో నింపవాCharanam 1
యెషయా పెదవులు కాల్చిన ఆత్మ
యెషయా దోషము కడిగిన ఆత్మ (both lines x2)
నా పెదవులను కాల్చగ రావా (x2)
నా దోషమును పరిహరింపవా
నా పాపమును కడుగగ రావాCharanam 2
యిర్మియా తలను జలమయముగా
కన్నుల కన్నీటి ఊటగా (both lines x2)
నింపిన పరిశుద్ధాత్మ దేవా (x2)
నా కన్నులను నింపగ రావా
నా తల జలమయముగ చేయగ రావాCharanam 3
ఎండిన ఎముకలలోనికి జీవం
రప్పించుటకై యెహెజ్కేలుతో (both lines x2)
ప్రవచింపమని పలికిన ఆత్మ (x2)
నాలో నీవు ప్రవచింప రావా
జీవాత్మ నలుదిక్కుల సంచరింపవాAaradinchedanu
Pallavi
ఆరాధించెదను ఆత్మతో నిరతం
ఆరాధ్య దైవమౌ ప్రభు యేసునిCharanam 1
ఆనంద గానము మనసారా పాడుచు
అనుదినం స్తోత్రింతును నా యేసునిCharanam 2
నరరూపధారుడు పాపరహితుడు
మరణపు ముల్లును విరిచిన విభునిCharanam 3
భజియించి స్తోత్రించి ఆరాధించెదను
అల్ఫయు ఓమెగయు నా యేసుడుCharanam 4
హల్లెలూయ యనుచు అర్పింతు నా హృదిని
భజియించి స్తోత్రించి మహిమ పరచెదనుCharanam 5
ఆరాధించెద ప్రభుని ఆత్మ సత్యములన్
అందరి ప్రభుడాయనే నా యేసుడుCharanam 6
పరలోక రాజ్యమును ధరయందు స్థాపించ
మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగCharanam 7
వరదూత గణములతో సమకూడి మనమంతా
స్తోత్ర గీతములు పాడెదం మన రాజుకు
ఇతర ఆల్బమ్‌లు

























