

الترانيم
Vijayulamai
Pallavi
విజయులమై వీరులమై
విజయులమై వీరులమై విజయ భేరి మ్రోగిద్దాము
జయ విజయుడైన యేసుని ఆరాధిద్దాం
ఆ జయశీలుడేసు ఓ విజయశాలి యేసు (x2)Charanam 1
రక్షణనే శిరస్త్రాణం ధరియిద్దాం
నీతియనే మైమరువును తొడుగుదాం
రారాజు యేసు కొరకు రయమున పయనిద్దాం
సాతానుని ఎదిరిద్దాం
సిలువ పతాకం ఎగురవేద్దాం (x2)
ఆ జయశీలుడేసు ఓ విజయశాలి యేసు (x2)Charanam 2
విశ్వాసపు డాలును ధరియిద్దాం
వాక్యమనే ఖడ్గము చేబూనుదాం
విజ్ఞాపనతో ప్రభు పాదాలను తడుపుదాం
సాతానుని ఎదిరిద్దాం
సిలువ పతాకం ఎగురవేద్దాం (x2)
ఆ జయశీలుడేసు ఓ విజయశాలి యేసు (x2)Charanam 3
సర్వాంగ కవచము ధరియిద్దాం
సత్యమనే దట్టి నడుమ బిగిద్దాం
సిద్ధ మనసనే జోడు పాదాలకు తొడుగుదాం
సాతానుని ఎదిరిద్దాం
సిలువ పతాకం ఎగురవేద్దాం (x2)
ఆ జయశీలుడేసు ఓ విజయశాలి యేసు (x2)Oka Divyamina Sangatito
Pallavi
ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము
బహుగా ఉప్పొంగుచున్నది
నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను
నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నదిCharanam 1
నరులకంటె నీవు అతి సుందరుడవై ఉన్నావు
నీ పెదవుల మీద దయారసము పోయబడియున్నది
కావున దేవుడు నిత్యము నిను ఆశీర్వదించునుCharanam 2
సత్యమును నీతిని స్థాపించుటకై నా దేవా
నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొందువు
కావున జనములు సర్వకాలము స్తుతించి పాడెదరుTrovanu Nadiche
Pallavi
త్రోవను నడిచే వారలారా
ఈలాగు జరుగుట చూడగా
చింత లేదా చింత కాదా
ప్రభు యేసు వైపు చూచుట నీ వంతు కాదాCharanam 1
రేయైన పగలైన నిను వీడలేదు
గాఢాంధకారాన తోడుండెనే
అరచేతులందు నిను చెక్కుకొనెను
హృదయాన ముదమార నిను దాచుకొనెనుCharanam 2
అలనాటి తొలినాటి ఆవేశమంతా
మెలమెల్లగా మిథ్యగా మారెనే
గుండెలోతు నీళ్లల్లో చేసిన
బాప్తిస్మ బాసలు కల్లలాయెనేCharanam 3
దేవాలయాలకు సభికులు రారు
దేవ సేవకులే లేరు
నిబిడాంధకారం సంఘాల కమ్మె
నిర్లక్ష్య భావం హృదయాల జిమ్మెCharanam 4
చిరకాల మన దేశ విశ్వాస సంఖ్య
మూడు శాతముగా నిల్చెనే
సంఘాలు పెరిగే పనివారు పెరిగే
అన్యుల ధన్యుల చేయరేలనుDeva NaaHrudayam
Pallavi
దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది (x2)
నేను పాడుచు స్తుతిగానము చేసెదను
నా ఆత్మ పాడుచు గానము చేయును
దేవా నా హృదయముCharanam 1
స్వరమండలమా సితారా (x2)
మేలుకొనుడి నేను వేకువనే లేచెదను (x2)
జనుల మధ్య నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లించెదను (x2)
జనములలో నిన్ను కీర్తించెదనుCharanam 2
యెహోవా నీ కృప (x2)
ఆకాశము మహాకాశము కంటే ఎత్తైనది (x2)
నీ సత్యము మేఘముల కంటే ఎత్తైనది (x2)
నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ముHalleluya Worshiping
Pallavi
హల్లెలూయా హల్లెలూయా (x2)
థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ (x2)Charanam 1
నిన్నే యేసు ప్రేమిస్తున్నా
నీకై యేసు జీవిస్తున్నా
హల్లెలూయా హల్లెలూయా (x2)Charanam 2
క్రొత్త పాట పాడుతున్నా
క్రొత్త రాగం పాడుతున్నా
హల్లెలూయా హల్లెలూయా (x2)Charanam 3
పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం (x2)
హల్లెలూయా హల్లెలూయా (x2)Pasipapala
Pallavi
పసిపాపలా నీ చేతులలో
నిదురించే భాగ్యము నాకీయవా (both lines x2)
కనుపాపవై నను కాపాడి (x2)
కడవరకు నను కాయవా
యేసయ్యా
పసిపాపలా నీ చేతులలో
నిదురించే భాగ్యము నాకీయవాCharanam 1
నీ వాక్యము చేత నా యవ్వనాన్ని
శుద్ధీకరించే జ్ఞానమీయవా (both lines x2)
నీ బలము కలిగి గొప్ప కార్యాలు (x2)
చేయువానిగా నను దీవించవా (x2)Charanam 2
నా ముదిమి వయస్సులో నీ కృప చేత
నను కాపాడే దేవుడవు నీవే (both lines x2)
ఆ వయస్సులోనే చిగురింపచేసి (x2)
నీ యదార్థత ప్రకటించనీయవా (x2)Jeevadipati
Pallavi
జీవాధిపతి జీవాధిపతి జీవాధిపతి యేసయ్యా
నీ కృప నీ కృప నాకే ఇచ్చావయాCharanam 1
నేల మంటితో నరుని సృజియించినావు
నాసికా రంధ్రములో జీవాత్మను ఆ... ఆ... ఆ...
నేల మంటితో నరుని సృజియించినావు
నాసికా రంధ్రములో జీవాత్మను ఊదినావు
నరుని జీవించు ఆత్మగా చేసినావుCharanam 2
ఏదేను వనములో జీవించు ఆత్మను
అపవాది నీ నుండి దూరపరచగా ఆ... ఆ... ఆ...
ఏదేను వనములో జీవించు ఆత్మను
అపవాది నీ నుండి దూరపరచగా
ప్రేమించి నరుని నీదు రక్తాన్ని చిందించి రక్షించినావుNaa Pranama
Pallavi
నా ప్రాణమా నీవేల కృంగియున్నావు (x2)
నాలో నీవేల తొందర పడుచున్నావు
నా ప్రాణమా
ఆ...Charanam 1
నీ దేవుడు ఏమాయెనని
వారు నిత్యము నాతో అనుచుండగా (both lines x2)
రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు
అన్నపానములాయెను (both lines x2)Charanam 2
దుప్పి నీటి వాగుల కొరకు
ఆశ పడునట్లుగా (both lines x2)
దేవా నా హృదయము నీ కొరకు
ఆశ పడుచున్నది (both lines x2)Yesaiah Namamu
Pallavi
యేసయ్య నామము పలికితేనే మోక్షము
యేసయ్య రాకడ రానైయున్నది
పాపులకు రక్షకుడై యున్నాడు క్రీస్తే
హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా (x2)Charanam 1
పావన రూపమున కన్యమేరి గర్భమున
వెలసెను క్రీస్తు పాపుల కోసమే (both lines x2)Charanam 2
మన పాపములకై యెరూషలేము వీధులలో
గొల్గొతా కొండపై బలియాయే క్రీస్తు (both lines x2)Charanam 3
పావన రూపుండు మన యేసు క్రీస్తు
సత్యము తెలుసుకో యేసుని నమ్ముకో (both lines x2)Halleluya Worshiping new
Pallavi 1
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (x2)
నిన్నే యేసు ప్రేమిస్తున్నా
నీకై యేసు జీవిస్తున్నా (both lines x2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
క్రొత్త పాట పాడుచున్నా
క్రొత్త రాగం పాడుచున్నా (both lines x2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం (x4)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (x3)Pallavi 2
పసిపాపలా నీ చేతులలో
నిదురించే భాగ్యము నాకీయవా (both lines x2)
కనుపాపవై నను కాపాడి (x2)
కడవరకు నను కాయవా యేసయ్యా
పసిపాపలా నీ చేతులలో
నిదురించే భాగ్యము నాకీయవాCharanam 1
నీ వాక్యము చేత నా యవ్వనాన్ని
శుద్ధీకరించే జ్ఞానమీయవా (both lines x2)
నీ బలము కలిగి గొప్ప కార్యాలు (x2)
చేయువానిగా నను దీవించవా (x2)Charanam 2
నా ముదిమి వయసులో నీ కృప చేత
నను కాపాడే దేవుడవు నీవే (both lines x2)
ఆ వయసులోనే చిగురింపచేసి (x2)
నీ యదార్థత ప్రకటించనీయవా (x2)
ألبومات أخرى

























