

பாடல்கள்
Aaradhana Aalaapana
Pallavi
ఆరాధనా ఆలాపనా (x2)
ఆత్మతో ఆరాధనా నా
హృదయముతో ఆలాపనా (both lines x2)Charanam 1
సత్యమనే దట్టి కట్టి
నీతియనే మైమరువు తొడిగి (both lines x2)
పౌలు వలె పరుగులు తీసి (x2)
క్రీస్తును ప్రకటించుటే ఆరాధనా
క్రీస్తును చూపించుటే ఆలాపనాCharanam 2
సజీవమైన యాగముగా
శరీరమును సమర్పించి (both lines x2)
క్రీస్తు వలె శ్రమలు సహించి (x2)
ప్రేమను ప్రకటించుటే ఆరాధనా
క్రీస్తు ప్రేమను చూపించుటే ఆలాపనాKrupa Krupa Nee Krupa
Pallavi
కృపా కృపా నీ కృపా
కృపా కృపా క్రీస్తు కృపా
నేనైతే నీ కృపయందు
నమ్మికయుంచియున్నాను
ఆ... నమ్మికయుంచియున్నానుCharanam 1
కృపను గూర్చి న్యాయము గూర్చి
నేను పాడెదను
నీ సన్నిధిలో నిర్దోషముతో
నేను నడచెదను
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణCharanam 2
దీనదశలో నేనున్నప్పుడు
నన్ను మరువనిది నీ కృపా
నేనీ స్థితిలో ఉన్నానంటే
కేవలము అది నీ కృపా
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణPadivelalo
Pallavi
పది వేలలో అతి సుందరుడు
భువిలో వెలసిన నా యేసుCharanam 1
ద్రాక్షా రసము కన్న అతి మధురము
నా యేసు ప్రేమ
నా ప్రాణ ప్రియుడు నన్నాదరించి
నారీమణి సుందరి నా ప్రియురాలా అని పిలచినాCharanam 2
వెండి పూవుల బంగారు సరములు
నా యేసు నా కొరకు చేయించెను
పరిమళ తైలపు సువాసన
నా యేసు నీ సన్నిధిలో నలు దిశలా వ్యాపించెను
மற்ற ஆல்பங்கள்

























