

Songs
Krupakalugunugaaka
Pallavi
కృప కలుగును గాక
క్రీస్తు కృప కలుగును గాక
భారతదేశ ప్రజలకు
ప్రపంచ మానవ జాతికిCharanam 1
నీ పేరు పెట్టబడిన నీ ప్రజలముగా
మమ్మును మేము తగ్గించుకొని
నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము
మా ప్రార్థనను అంగీకరించుముCharanam 2
చీకటిలో నుండి ఆశ్చర్యమైన
నీ వెలుగులోనికి మమ్మును పిలిచావు
యాజకులమై ప్రార్థించుచున్నాము
పరిశుద్ధ జనముగా మొరలిడుచున్నాముCharanam 3
నీవొక్కడివే మహాశ్చర్య కార్యాలు
చేయగలిగిన కృపగల దేవుడవు
ఒక్క దినములోగా మా దేశ దోషమును
పరిహరించగల ఏకైక దేవుడవుNa Doshamulannitini
Pallavi
నా దోషములన్నిటిని క్షమియించావు
నా పాపములన్నిటిని పరిహరించావు (both lines x2)
నీకే నీకే స్తోత్రమయా
నన్ను బ్రతికించిన నా యేసయ్యా (both lines x2)Charanam 1
పడమటికి తూర్పు ఎంత దూరమో
నా అతిక్రమములన్ని అంత దూరపరచావు (both lines x2)
నీతి సూర్యుడా నాపై ఎంత ప్రేమ చూపావు
దీర్ఘశాంతుడా నాపై ఇంత జాలి ఎందుకు (both lines x2)
ఇంత జాలి ఎందుకుCharanam 2
మేలుతో నా హృదయాన్ని తృప్తి పరచియున్నావు
పక్షిరాజు యవ్వనాన్ని బహుమతిగా ఇచ్చావు (both lines x2)
ప్రేమ స్వరూపుడా నీలో నన్ను దాచియుంచావు
నిర్మలాత్ముడా నాపై నీదు ఆత్మ ఉంచావు (both lines x2)
నీదు ఆత్మ ఉంచావుEnding
హల్లెలూయా హల్లెలూయా (x4)Yesayya Yedapai ne vaalopotha
Pallavi
యేసయ్య ఎదపై నే వాలిపోతా
నా కలతల్ని నే మరచిపోతా (both lines x2)
శాశ్వత నివాసం నీలోనే నాకు
పరలోకమే మనకు యుగయుగము వరకు (both lines x2)
యేసయ్య ఎదపై నే వాలిపోతా
నా కలతల్ని నే మరచిపోతాCharanam 1
నీ ప్రేమ కావ్యాన్ని రచించలేను
నీ మధుర భావాలు పలికించలేను (both lines x2)
విరిగిన నలిగిన మనసు నీకియ్యగలను
కడవరకు నీ ప్రేమ ప్రకటించగలను (both lines x2)Charanam 2
నా కాలు జారెనని నేను అనుకొనగా
నీ కృపతో నన్ను బలపరచినావు (both lines x2)
నా అంతరంగమున వేదనలు కలుగగా
అధికమైన కృపతో ఆదరించావు (both lines x2)Aakarshichumu thandri Aakarshinchumu
Pallavi
ఆకర్షించుము తండ్రి ఆకర్షించుము
యేసయ్యలోనికి ప్రజలను ఆకర్షించుము
ఆరాధింతుము నిన్నే ఆరాధింతుము
మా పూర్ణ బలముతో నిన్నే ఆరాధింతుముCharanam 1
ఏ పాపమెరుగని యేసులోనికి ఆకర్షించుము
ఏ దోషమెరుగని క్రీస్తులోనికి ఆకర్షించుము
నువ్వు ఆకర్షించకపోతే క్రీస్తుని ఎరుగలేరయ్యా
నీ కృపనే అనుగ్రహించకపోతే ఎవ్వరు రాలేరయ్యాCharanam 2
నీ చిత్తము చేసిన యేసులోనికి ఆకర్షించుము
నిన్ను మహిమపరచిన క్రీస్తులోనికి ఆకర్షించుము
నీ ప్రియమైన కుమారుడు యేసు క్రీస్తే కదయ్యా
నీవాయన యందే ఆనందించానన్నావుగా అయ్యాCharanam 3
నిత్యజీవమొసగిన యేసులోనికి ఆకర్షించుము
అందరికి ప్రభువైన క్రీస్తులోనికి ఆకర్షించుము
యేసయ్యను నమ్మకపోతే రక్షణ లేదన్నావుగా
ఇది నమ్మకపోతే పరలోకానికి రాలేరన్నావుగాSthuthi Yaagamu Chesedha
Pallavi
స్తుతి యాగము చేసెదా నా యేసుకి (x2)
స్తోత్ర బలి అర్పించెదా కరుణామయునికి
స్తుతి యాగము చేసెదాCharanam 1
ప్రేమకు రూపమై నీతికి నిరవచనమై (x2)
శాంతికి నిలయమై బలియైతివి మము బ్రోవగ సిలువపైCharanam 2
పరిశుద్ధుడవు పరమాత్ముడవు (x2)
పరిపూర్ణుడవు పదివేలలో అతి సుందరుడవు నీవేCharanam 3
యేసయ్యా స్తోత్రమయా యేసయ్యా స్తోత్రమయా (x2)
ఆదియు నీవే అంతము నీవే ఆల్ఫయు నీవే ఒమేగయు నీవే
మొదటి వాడవు కడపటి వాడవు మృతుడై తిరిగి లేచిన వాడవు (these 3 lines x2)Nee Krupa Nithyamu nannu
Pallavi
నీ కృప నిత్యము నన్ను బ్రతికించుచున్నది
నీ కృప నిత్యము నన్ను నడిపించుచున్నది (both lines x2)
శాశ్వతమైనది నీ కృపా (x2)
అధికమైనది ఆ కృప యేసయ్యా
నీ కృప నిత్యము నన్ను బ్రతికించుచున్నది
నీ కృప నిత్యము నన్ను నడిపించుచున్నదిCharanam 1
నోవహును తప్పించినది రక్షించినది నీ కృప
దావీదును నీ హృదయానుసారునిగా నిలబెట్టుకున్నది నీ కృప (both lines x2)
ఏదేనుని నీ సాక్షిగా (x2)
వాడుకుంటున్నది నీ కృప యేసయ్యా
నీ కృప నిత్యము నన్ను బ్రతికించుచున్నది
నీ కృప నిత్యము నన్ను నడిపించుచున్నదిCharanam 2
నేను బాధింపబడిన దినములలో నాకు న్యాయాన్ని తీర్చింది నీ కృప
నీ మార్గాలను నాకు తెలియచేసి నీ క్రియలను కనపరచెను ఆ కృప (both lines x2)
నీ యందలి భయభక్తులను (x2)
నాకు నేర్పించింది నీ కృప యేసయ్యా
నీ కృప నిత్యము నన్ను బ్రతికించుచున్నది
నీ కృప నిత్యము నన్ను నడిపించుచున్నది
శాశ్వతమైనది నీ కృపా (x2)
అధికమైనది ఆ కృప యేసయ్యా
నీ కృప నిత్యము నన్ను బ్రతికించుచున్నది
నీ కృప నిత్యము నన్ను నడిపించుచున్నదిKoyila nenai
Pallavi
కోయిల నేనై తీయని పాట
హాయిగా పాడెదను
యేసయ్యా నీ సన్నిధిలో
నా నిత్యము స్తుతించెదనుCharanam 1
వేకువనే లేచి నీ సన్నిధిలో
స్తుతి గానము నే చేసెదను
అనుదినము నీ దివ్య వాక్యము
ఆనందముతో ధ్యానించెదను
ఆత్మారాధన స్తుతి యాగముగా
క్షణ క్షణము నీకర్పించెదనుCharanam 2
నిజమైన ద్రాక్షావల్లివి నీవే
నీలో తీగెగా నను ఉంచావు
నీ మాటలలోని పరిశుద్ధతతో
బహుగా నేను ఫలించెదను
పరిమళ ధూపము ఈ స్తుతి ద్వారా
యుగయుగములకు నీకే కలుగునుUmmi Veyavalasina jeevitham
Pallavi
ఉమ్మివేయవలసిన జీవితం నాది
ఊరేగించుచున్నావు (both lines x2)
అర్థం కానిది నీ ప్రేమ
నాకర్థం కానిది నీ కృప (both lines x2)
ఉమ్మివేయవలసిన జీవితం నాది
ఊరేగించుచున్నావుCharanam 1
ఎన్నో మారులు అపవిత్రునిగా
నీ సేవ కోసం నిలుచున్నాను
పరిశుద్ధతలోని ప్రాముఖ్యతను
గుర్తెరుగకనే జీవించాను (these 4 lines x2)
యేసయ్యా...
నా వైపు చూశావు నన్ను క్షమించావు (x2)
నీ కృపలో నను కరుణించావు (x2)Charanam 2
జీవపు డంబాన్ని దాచివేసి
లేని వాని వలె నటించాను
పైకి భక్తితో నీ శక్తి లేకుండా
ఆత్మ కార్యాలు కావాలన్నాను (these 4 lines x2)
యేసయ్యా...
మా దేశములో ఉజ్జీవమును
నేనే నేనే అడ్డుకున్నాను
మరొకసారి నను బ్రతికించావు (x2)Prabhu Yesu manalo undaga
Pallavi
ప్రభు యేసు మనలో ఉండగా
భయమేల మనకిలలో
ప్రభు బాటలో పయనించుచు
పరలోకమేగుదమాCharanam 1
నిజమైన దేవుడవు
యుగయుగముల దేవుడవు
జీవము గల దేవుడవు
సృష్టంతయు నీదే ప్రభుCharanam 2
మా ప్రార్థన వినుము
మా ఆర్తధ్వని వినుము
మా పాపములన్నిటిని
క్షమించుము ఓ దేవాCharanam 3
మా దుఃఖ సమయములో
ఓదార్పు నీవే ప్రభు
మా చీకటి బ్రతుకులలో
మా వెలుగువు నీవే ప్రభుCharanam 4
నీ స్వరము వినబడగా
మా మనసే పొంగెనుగా
మా హృదయములోకిప్పుడే
రారమ్ము ఓ దేవాCharanam 5
ఈ పాప లోకంలో
ఈ అంత్య దినములలో
నీ కాపుదల లేక
జీవించుట కష్టమిలాCharanam 6
హల్లెలూయా హల్లెలూయా (x4)
Pallavi 2
శక్తి చేత కాదనెను
బలముతో ఇది కాదనెను
నా ఆత్మ ద్వారా దీని చేతునని
యెహోవా సెలవిచ్చెనుCharanam 7
ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవుCharanam 8
యెహోవా రక్షించిన నిన్ను
పోలిన వాడెవడు
Other albums

























