

Songs
Modati Prema
Pallavi
మొదటి ప్రేమ మొదటి ప్రేమ (x4)
నీవు విడచితివి
ప్రభుని మరచితివి (both lines x2)Charanam 1
ఈ లోకంలో అన్ని ప్రేమలు
నిను వంచించిన వేళలో
క్రీస్తు ప్రేమ నీ దరి చేరి
కలతలు బాపి ఓదార్చింది
ఆ క్రీస్తు ప్రేమను నువ్వు వంచించి
లోక ప్రేమలకు వెళ్లిపోయావు (both lines x2)Charanam 2
ఆనాడు క్రీస్తుని యూదా జనులు
ఒక్కసారే సిలువకు వేశారు (both lines x2)
ఈనాడు నీవు దినదినము
క్రీస్తుని సిలువకు వేస్తున్నావు
ఈనాడు నీవు అనుక్షణము
క్రీస్తుని సిలువకు వేస్తున్నావుCharanam 3
ఏ స్థితిలో నువ్వు పడిపోయావో
జ్ఞాపకము చేసుకుని మనసు మార్చుకో (both lines x2)
నూతన పరచబడి మొదటి ప్రేమను
తిరిగి నీవు పొందుకో (both lines x2)Atmathonu manasuthonu
Pallavi
ఆత్మతోను మనసుతోను పాడుచున్నా
ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తున్నా
హల్లెలూయా నా యేసుకే
హల్లెలూయా ఆరాధనా (both lines x2)Charanam 1
ఆత్మే నాకు ఆనందము
ఆత్మే నాకు ఆలోచన (both lines x2)
ఆత్మే నాకు ఆవేశము
ఆత్మే నాకు అభిషేకము (both lines x2)Charanam 2
ఆత్మలోనే నాకు శాంతము
ఆత్మలోనే నాకు మంచితనము (both lines x2)
ఆత్మలోనే ఆశానిగ్రహము
ఆత్మలోనే నాకు విశ్వాసము (both lines x2)Charanam 3
ఆత్మనే అనుసరించి జీవించుతా
ఆత్మ నిబంధనలో కొనసాగుతా (both lines x2)
ఆత్మనే అనుసరించి ప్రేమించుతా
ఆత్మనే అనుసరించి మరణించుతా (both lines x2)Saswata Kalamunundi
Pallavi
శాశ్వత కాలము నుండి
శాశ్వత కాలము వరకు (both lines x2)
స్తుతింపదగినది నీ నామం
కీర్తింపదగినది నీ గానం (both lines x2)
శాశ్వత కాలము నుండి
శాశ్వత కాలము వరకుCharanam 1
గాలి రెక్కల మీద నీ గమనము
మేఘములే నీకు వాహనము (both lines x2)
అగ్ని జ్వాలలే నీకు సేవకులు
వాయువులే నీకు దూతలును (both lines x2)Charanam 2
రత్నములే నీ నేత్రములు
పద్మములే నీ పెదవులు (both lines x2)
స్వర్ణ గోళమే నీ కరములు
పూల పాన్పులే నీ చెక్కిళ్ళు (both lines x2)యేసయ్యా నా యేసయ్యా (x2)
Yesaiah Ninnu Chudali
Pallavi
యేసయ్యా... నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా... నిన్ను చేరాలని ఆశ (both lines x2)Charanam 1
ఎవరు ఉన్నారు నాకు... ఈ లోకంలో
ఎవరు నాతోడు రారు... ఈ లోకంలో
ఇమ్మానుయేలైన... నా దైవం నీవేగా (x2)Charanam 2
అందరు ఉన్నారని... ఆ... అందరు నావారని (x2)
తలచితిని... భ్రమసితిని... (x2)
చివరికి ఒంటరి నేనైతిని (x2)
నా గానం నీవయ్యా... నా జ్ఞానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా... నా సర్వం నీవయ్యాCharanam 3
అంధకారములో... ఆ... అంధురాలు నేనైతిని (x2)
నిన్ను చూసే... నేత్రములు... (x2)
నాకు ఒసగుమా నజరేయుడా (x2)
నా ఆశ నీవయ్యా... నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా... నా భాష నీవయ్యాAtmalenivadu
Pallavi
ఆత్మ లేని వాడు నా వాడు కాడు
ఆత్మ లేని వాడు నను చేరలేడు (both lines x2)
అని చెప్పిన యేసయ్యా స్తోత్రము స్తోత్రము
సెలవిచ్చిన మెస్సయ్యా స్తోత్రము స్తోత్రము
ఆత్మ లేని వాడు నా వాడు కాడు
ఆత్మ లేని వాడు నను చేరలేడుCharanam 1
ఆత్మ లేకుండా నీ పాపాన్ని ఒప్పుకోలేవు
ఆత్మ స్వరము వినకుండా నీ పాపాన్ని విడువను లేవు (both lines x2)
అందుకే సంఘమా ఆత్మ చెప్పే మాట విను (x2)Charanam 2
ఆత్మ లేకుండా క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్టించుకోలేవు
ఆత్మ లేకుండా క్రీస్తుని ప్రభువుగా ప్రకటించలేవు (both lines x2)
అందుకే సంఘమా ఆత్మ చెప్పే మాట విను (x2)Charanam 3
ఆత్మ లేకుండా నీ పొరుగు వారిని ప్రేమించలేవు
ఆత్మ లేకుండా తండ్రిని సత్యముతో ఆరాధించలేవు (both lines x2)
అందుకే సంఘమా ఆత్మ చెప్పే మాట విను (x2)Chocolate Kante Sweeti
Pallavi
చాక్లెట్ కంటే స్వీటీ (స్వీటీ)
బొమ్మల కంటే బ్యూటీ (బ్యూటీ)
దేవుని పిల్లల భేటీ
మన ఆదివారపు బడి (x2)Charanam 1
అమ్మ వండిన పాల బువ్వ ఎంతో ఎంతో రుచి
ఎంతో ఎంతో రుచి
కమ్మనైన క్రీస్తు మాటలు ఇంకా ఇంకా రుచి
మాకు ఇంకా ఇంకా రుచిCharanam 2
స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం మాకు ఎంతో ఇష్టం
మాకు ఎంతో ఇష్టం
గుళ్ళో అన్నలు నేర్పిన కథలు ఇంకా ఇంకా ఇష్టం
మాకు ఇంకా ఇంకా ఇష్టంCharanam 3
పాటలు పాడి వాక్యం చదివి భక్తులమైపోదాము
భక్తులమైపోదాము
గబగబ నడిచి సండే స్కూలుకు అందరమెళ్ళిపోదాము
మనము అందరమెళ్ళిపోదాముKotta Pata
Pallavi
కొత్త పాట పాడను రారే
కొత్త రూపు పొంద రారే
హల్లెలూయా హల్లెలూయా పాట పాడెదం
ప్రభు యేసుకే స్తోత్రం
మన రాజుకే స్తోత్రంCharanam 1
శృంగనాదం చేయండి హల్లెలూయా
హోసన్నా అని పాడండి హల్లెలూయా
ఉల్లసించి పాడరే హల్లెలూయా
ఎల్లరు జై కొట్టరే హల్లెలూయాCharanam 2
అడుగడుగో మన యేసు రాజు మేఘంలోన
రానైయున్నాడు కొంచెం కాలంలోన
జేజేలు పాడుచు ఎదురెళదాం
దూతాళి వలె నింగి కెగిరెళదాంCharanam 3
కొంత కాలమే క్రైస్తవుడా ఈ కన్నీరు
అంతలో వర్షించునోయ్ పన్నీరు
ప్రతి భాష్ప బిందువు తుడుచునులే
ప్రతి నోరు హల్లెలూయా పాడునులేModati Prema Tirigi
Pallavi
మొదటి ప్రేమ తిరిగి నొసగి
నన్ను కనికరించవా (both lines x2)
ఆత్మలోనే నన్ను నిలిపి (x2)
ఆదరించి బ్రోవవా (x2)
మొదటి ప్రేమ తిరిగి నొసగి
నన్ను కనికరించవా
Charanam 1
మొదటి ప్రేమ మరచిపోయి
జీవితాన కృంగిపోతి (both lines x2)
నీదు ప్రేమలోన నిలిపి (x2)
ఆదరించి బ్రోవవా (x2)
Charanam 2
మొదటి ప్రేమ వదలలేను
నిన్ను విడిచి బ్రతుకలేను (both lines x2)
ఆత్మ ఫలము అనుగ్రహించి (x2)
అమర ప్రేమ నీయవా (x2)Aaradhana
Pallavi
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
మహిమ గల రాజుకే ఆరాధనా
కృప గల తండ్రికే ఆరాధనా (both lines x2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాCharanam 1
అద్వితీయుడు నన్ను వెదకిన నా యేసు
నిష్కల్మషమైనవాడు నన్ను పిలచిన నా క్రీస్తు (both lines x2)
ప్రధాన యాజకుడు నీతి సూర్యుడు నా యేసు
పాపులలో చేరనివాడు నాకు చాలిన నా ప్రభువు (both lines x2)Charanam 2
ఆత్మ విషయములో నీతిమంతుడు నా యేసు
రక్షకుడని జనములలో ప్రకటింపబడెను నా క్రీస్తు (both lines x2)
లోకమంతటిలో నమ్మబడెను నా యేసు
ఆరోహణుడై తేజోమయుడాయె నా ప్రభువు (both lines x2)Outro
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (x2)
Other albums

























