

Songs
Naa Bratukulo
Pallavi
నా బ్రతుకులో ప్రశాంతత ఇచ్చింది నీ ప్రేమ
నా జీవితానికి గమ్యాన్ని చూపింది నీ ప్రేమ
సర్వకృపానిధి యేసయ్యా నా కాపరి నీవేనయా
సర్వకృపానిధి యేసయ్యా నీ చాటున నను దాచనీCharanam 1
అదృశ్యమైన మహిమతో నను నింపింది నీ ప్రేమ
అనూహ్యమైన కరుణతో నను కాచింది నీ ప్రేమ
అలసిన బ్రతుకులో ఆదరణ పంపింది నీ ప్రేమ
అడుగంటిన నా జీవితాశను చిగురింపజేసింది నీ ప్రేమCharanam 2
నిను ద్వేషించినా నను ప్రేమించింది నీ ప్రేమ
నిను శపియించినా నను క్షమియించింది నీ ప్రేమ
నిను వంచించినా నను విడిపించింది నీ ప్రేమ
నిను బాధించినా నను దీవించింది నీ ప్రేమSamudramumeeda
Pallavi
సముద్రము మీద నడచిన వాడు
నీళ్లను ద్రాక్షారసముగ చేసిన వాడు
గాలి తుఫానును అణచిన వాడు
ఏడు కన్నుల నా యేసు క్రీస్తుCharanam 1
రేయి పవలు కాపాడు వాడు
లేమి కలుగకుండ చేయు వాడు
ప్రేమ ధారలను కురిపించు వాడు
ఏడు కన్నుల నా యేసు క్రీస్తుCharanam 2
హృదయ శుద్ధిని కోరిన వాడు
హృదయాలోచన ఎరిగిన వాడు
సర్వ జీవులను పోషించు వాడు
ఏడు కన్నుల నా యేసు క్రీస్తుYesaiah Neeloni
Pallavi
యేసయ్యా యేసయ్యా
నీలోని ప్రేమ ధారలతో
నాలో నూతన ఉజ్జీవమును
కలిగించవా
నీయందు నీ ప్రజలు ఆనందించగా
మరొకసారి నన్ను బ్రతికించవాCharanam 1
గడచిన దినాలన్నీ పరికించగా
నేను చేసిన పాపములను తలపోయగా
నీ ప్రేమయే నన్ను బ్రతికించెను
ఆ ప్రేమలో నన్ను నిలిచియుండనీCharanam 2
నీ ప్రేమలో ఉన్నది నిత్యజీవము
ఆ జీవము నాలోన ప్రవహించనీ
నీ ప్రేమకు ఏనాడు లేదు అంతము
ఆ ప్రేమకు నా జీవితమే సాక్ష్యముAmmaane Nee Pilupulo
Pallavi
అమ్మా అనే నీ పిలుపులో
దాగియున్నది నీ ప్రేమ
యేసయ్యా ఆ ప్రేమే
మార్చింది నా జీవితంCharanam 1
పిలిచావు సిలువపైన అమ్మా అని
ఆ పిలుపులోని నీ ప్రేమను
గ్రహించినప్పుడు నా హృదయం
కన్నీరు ఏరులై పారిందిCharanam 2
మామూలు మనిషిగానే జన్మించి
మనుష్యులలో జీవించలేని
సమరయ స్త్రీని ఒకనాడు
పిలిచావు అమ్మా అని
మనుష్యుల పట్టే జాలరిగా
మార్చావు ఆ జీవితంKannirela O Chellemma
Pallavi
కన్నీరేల ఓ చెల్లెమ్మా
కలతలు నీకేలా (both lines x2)
కన్నీరు తుడిచే యేసయ్యున్నాడు (x2)
కలతలు బాపే ప్రేమామయుడుCharanam 1
లోకంలో అందరు నిన్ను విడిచారా
నీ అందం నిన్ను మోసగించిందా (both lines x2)
నీ కలిమి నిన్ను కలవరపరచిందా (x2)
నీ లేమి నిన్ను కృంగదీసిందాCharanam 2
ఏ ప్రేమ సాటిలేదు యేసు ప్రేమకు
ఆ ప్రేమ నీకుంటే ఏ లోటు ఉండదు (both lines x2)
ప్రేమకు అర్థం యేసయ్యే (x2)
యేసయ్యంటే ప్రేమేలేYesuni Namam
Pallavi
యేసుని నామం ఎంతో మధురం తీయగ పాడండి
యేసుని నమ్మిన జీవితమే ఇల ధన్యమని చాటండి (both lines x2)
యేసే మన గానం యేసే మన జీవం
యేసే మన ధ్యానం యేసే దైవం (both lines x2)Charanam 1
సత్యము నీవే జీవము నీవే
మము నడిపించే మార్గము నీవే (both lines x2)
పాపుల బ్రోచే పెన్నిధి నీవే (x2)Charanam 2
కరుణవు నీవే శాంతివి నీవే
ఇలలో నిలిచే దైవము నీవే (both lines x2)
ఆరని జ్యోతివి నీవే దేవా (x2)Andalennenno
Pallavi
అందాలు ఎన్నెన్నో ఉన్నా
ఆనందం ఎంతో ఉన్నా
నీ సేవలోని దివ్యానుభూతి
ఇంకెందు లేదు దేవా (both lines x2)Charanam 1
ఈ లోకమే నటనాలయం
ఈ జీవితం పాపపు నిలయం
ఈ లోకమే ఒక నటనాలయం
ఈ జీవితం పాపపు నిలయం
నీ ప్రేమ లేని జీవితం
ఏనాటికైనా శూన్యం (both lines x2)Charanam 2
నీ ప్రేమను నీ దీవెనను
గ్రహించలేని పాపిని నేను (both lines x2)
నీ కరుణ లేని జీవితం
ఏనాటికైనా వ్యర్థం (both lines x2)Ending
ఇంకెందు లేదు దేవా (x2)
ఇంకెందు లేదు యేసయ్యా
Other albums

























