

Songs
YESU NEE KRUPA
Pallavi
యేసు నీ కృప మాకు శాశ్వతమైనది
దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది
దావీదుకు చూపిన శాశ్వత కృపను
నీవు మా యెడల చూపితివిCharanam 1
గొర్రెల కాపరిని కనుగొన్నావు
నీ ప్రజల మీద రాజుగా చేశావు
నీవు కాపరివై నడిపించావు
హృదయానుసారునిగా మార్చుకున్నావుCharanam 2
నీ కృప తలంచిన యోనా భక్తుని
చేప కడుపు నుండి కాపాడితివి
నీ కృప ధ్యానించిన కోరహు సంతతిని
శాపము నుండి విడిపించితివి
శాశ్వత కృపను మాకిచ్చుటకై
నీ ప్రాణమునే ఇచ్చితివిCharanam 3
మా హృదయము యొక్క తలంపులలోని
ఊహలన్నియు చెడిపోయినవి
పతనమైన మనిషికి నీ కృప చూపి
మా పాప భారమును నువ్వు మోసితివి
కన్నతల్లి ప్రేమకంటే
మిన్నయైన ప్రేమను
కలువరి సిలువలో చూపితివిNINNA PREMINCHUTHA
Pallavi
నిన్నే ప్రేమించుతా నిన్నే స్తుతియించుతా
నీలోనే నమ్మకముంచి నీతోనే జీవిస్తా (both lines x2)
యేసూ... అతికాంక్షనీయుడా
యేసూ... నా ప్రాణ ప్రియుడా (both lines x2)Charanam 1
నిన్ను ప్రేమించు వారిని అన్ని విధముల ఆశీర్వదించే దేవుడవు
నిన్ను స్తుతియించు వారిని శాశ్వత కృపతో కాపాడగలిగే తండ్రివి (both lines x2)
నా... సహాయము నీవే... నా యేసయ్యా
నా... ఆధారము నీవే... నా మెస్సయ్యాCharanam 2
నీవు నాతోనే ఉండి నాకోసం సాహస కార్యములు చేసెదవు
నేను నీ గుమ్మములలో ప్రవేశించి నీకు స్తుతులను చెల్లింతును (both lines x2)
నీ... మందిరముగా... నా దేహమును
చే... సితివి... నీ... దయతోVASTUNDI
Pallavi
వస్తుంది వస్తుంది క్రిస్మస్
వెళుతుంది వెళుతుంది క్రిస్మస్ (both lines x2)
యేసుని నమ్మడమే నిజమగు క్రిస్మస్
యేసులో జీవించుటే అసలైన క్రిస్మస్ (both lines x2)
క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (both lines x2)Charanam 1
కన్య మరియ గర్భాన క్రిస్మస్
యేసు క్రీస్తు పుట్టాడు క్రిస్మస్
సత్రములో చోటులేక క్రిస్మస్
పశువుల తొట్టిలోన క్రిస్మస్ (these 4 lines x2)
పరుండబెట్టిరి పాటలెన్నో పాడిరి
పరవశించిరి ఆరాధించిరి (both lines x2)Charanam 2
ఆకాశాన నక్షత్రం క్రిస్మస్
లోకానికి సాక్షిగా క్రిస్మస్
తూర్పు దేశ జ్ఞానులు క్రిస్మస్
కానుకలు అర్పించిరి క్రిస్మస్ (these 4 lines x2)
గొర్రెల కాపరులు సంతోషించి
రక్షణను ప్రకటించి ఆరాధించిరి (both lines x2)Charanam 3
పరలోక సైన్యమంత క్రిస్మస్
స్తోత్ర గీతాలతో క్రిస్మస్
శుభవార్తమానమును క్రిస్మస్
లోకానికి ప్రకటించిరి క్రిస్మస్ (these 4 lines x2)
సర్వోన్నతమైన స్థలములలో
యేసుకే మహిమయని ఆరాధించిరి (both lines x2)SILUVALO
Pallavi
సిలువలో యేసయ్య నీవు చూపిన ఆ ప్రేమను
లోకములో వేరెవరు దానిని చూపలేరయ్యా (both lines x2)
ఏ స్థితిలో నేనున్నా సిలువ ప్రేమే చాలయ్యా (x2)
సిలువలో యేసయ్య నీవు చూపిన ఆ ప్రేమనుCharanam 1
పాపినైన నా కోసం నీవు చేసిన త్యాగము
ఎన్నటికి నే మరువలేను ఆ జాలి ప్రేమను (both lines x2)
నా దోషము బాపగా నీవనుభవించిన శిక్షను (x2)Charanam 2
క్షమా గుణమును చూపించి పాపిని రక్షించితివి
బాధ్యతను నెరవేర్చినావు తండ్రి చేయి విడచినా (both lines x2)
అంతులేని ఆ వేదన నాకై సహించినావు (x2)Charanam 3
ఆత్మ దాహము చూపావు సమాప్తము అని పలికినావు
తండ్రి చేతికి నీ ఆత్మను పవిత్రతతో ఇచ్చినావు (both lines x2)
సిలువ రక్తములోనే పాపములకు క్షమాపణ (x2)NALONI
Pallavi
నాలోని రాగాలు
నీ ప్రేమ గీతాలై (both lines x2)
సెలయేరులై ప్రవహించాలి
నా యేసుని సన్నిధికి (both lines x2)Charanam 1
పులకించె తనువంతా
నా యేసుని ప్రేమతో (both lines x2)
నా వరునితో నా ప్రియునితో (x2)
యుగయుగములు కలిసుంటా (x2)Charanam 2
నీతోనె సహవాసం
నా జీవిత గమ్యం (both lines x2)
కనుమూసినా కనుతెరచినా (x2)
మనసంతా నీవేలే (x2)Charanam 3
నీ ప్రేమ జ్వాలను
చల్లార్చలేరెవరు (both lines x2)
నా స్నేహితుడా అతి సుందరుడా (x2)
త్వరగాను రావాలి (x2)Sthuthi Aradhana
Pallavi
స్తుతి ఆరాధన
మహిమ గల తండ్రికే
స్తుతి ఆరాధన
ప్రేమ గల యేసుకేCharanam 1
సర్వోన్నతుడా మహోన్నతుడా
కరుణ గల దేవాCharanam 2
సంవత్సరము నీ దయ కిరీటము
మాకు ధరింప చేసితివి
సమాధి నుండి మా ప్రాణమును
విమోచించి కాపాడితివిCharanam 3
మాలోని లోపాలు గుర్తింప చేసి
సరి చేశావు నీ ప్రేమతో
కృపాభిషేకము క్రుమ్మరించి
దీవించావు నీ దయతోAATHMALA RAKSHNA KOSAM
Pallavi
ఆత్మల రక్షణ కోసం ప్రార్థించు
ఆత్మల రక్షణ కోసం ప్రకటించు (both lines x2)
ప్రార్థించి ప్రకటించు
ప్రకటించి ప్రార్థించు (both lines x2)
యేసే నిజ రక్షకుడని
యేసే విమోచకుడని (both lines x2)Charanam 1
మన ప్రార్థన దేశానికి ఆశీర్వాదకరముగా మారాలి
ఆసక్తితో అనునిత్యము ఎడతెగని ప్రార్థనలు జరగాలి (both lines x2)
సంఘాల ప్రార్థనలు ధూపము వలె ప్రభు పాదముల చెంత చేరాలి (x2)
నాలో మనలో జరగాలి
ఇది నాలో మనలో జరగాలి
ప్రార్థనే మన ఆయుధం
ప్రార్థనే మన జీవితం (both lines x2)Charanam 2
ఉదయమందున సాయంత్రమున ప్రతి సమయమందు సువార్తను ప్రకటించాలి
కన్నీటితో ప్రకటించాలి సంతోష గానాలతో పంట కోయాలి (both lines x2)
ఆత్మలు మనలను వెదకలేరు మనమే ఆత్మలను వెదకాలి (x2)
నాలో మనలో జరగాలి
ఇది నాలో మనలో జరగాలిMADHILONA
Pallavi
మదిలోన ఎదలోన నివసించే నా యేసు
తనువంతా మనసంతా నా ప్రియుడా నీకోసం
Charanam 1
దయగలిగించేవి నీ మాటలు
కృప చూపించేది నీ వాక్యము
నీ శాసనములు అతి ప్రియములు
నా పూర్ణ హృదయముతో వెదకెదను
నా జీవితానికి అవి దీపము
నా జీవితానికి అవి గమ్యము
Charanam 2
నీ మార్గములలో నడచెదను
నీ సత్యమునే కోరెదను
వెండి బంగారము కోరను
నీ మాటలనే నేను అడిగెదను
నీ కృప చేత నన్ను రక్షింపుము
నీ దయ చేత నన్ను కరుణింపుము
Other albums

























