

Songs
Agni Jwala
Pallavi
అగ్ని జ్వాల వంటి కన్నులు కలవాడా
అపరంజిని పోలిన పాదములు కలవాడా (both lines x2)
యేసయ్యా స్తోత్రము (x4)Charanam 1
మొదటి వాడా కడపటి వాడా
మృతుడై తిరిగి లేచిన వాడా (both lines x2)Charanam 2
ఏడు నక్షత్రములు కలిగిన వాడా
ఏడు ఆత్మలు కలిగిన వాడా (both lines x2)Charanam 3
సత్య స్వరూపి పరిశుద్ధాత్ముడా
ధవళ వర్ణుడా రత్న వర్ణుడా (both lines x2)Nee Krupa Naaku
Pallavi
నీ కృప నాకు చాలును దేవా
నీ కృపలో నేను నిలచియుందును ప్రభువా
యేసయ్యా నా యేసయ్యా (x2)Charanam 1
జీవముకంటె ఉత్తమమైనది నీ కృప
నాలో ఉజ్జీవమును కలిగించినది నీ కృపCharanam 2
రేయి పవలు నాతో ఉండేది నీ కృప
నే నిను విడచినా నను విడువనిది నీ కృపCharanam 3
కనుపాపవలె నను కాపాడేది నీ కృప
నా ఆత్మలో కన్నీరు తుడిచేది నీ కృపCharanam 4
ప్రేమ వాకిలిలో నను చేర్చినది నీ కృప
ఆ ప్రేమను నాలో సంపూర్తి చేసేది నీ కృపYesaiah Nee Padadhulini
Pallavi
యేసయ్య నీ పాద ధూళినై
అనుక్షణము ఆరాధింతును
ద్రాక్షావల్లిలో తీగనై
కలకాలం నిలచియుందునుCharanam 1
నీవు లేని నా జీవితం
ఎండిన ఎడారి
నీలోనే నాకు దొరుకు
నిత్యజీవ జలనిధి
కన్నతల్లి మరచినా
నను మరువని యేసయ్య
కౌగిలిలో చేర్చినా
కలతలన్ని బాపిన దేవాCharanam 2
యేసయ్య నీ ప్రేమే
మార్చింది నా జీవితం
మారిన నా జీవితం
కడవరకు అంకితం
ప్రేమంటే ఏమిటో
నేర్పింది నీ ప్రేమ నిను
ప్రేమించే హృదయానికే
అర్ధమౌను ఆ ప్రేమNaa Kannula Kanniru
Pallavi
నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే
ఆరాధనా ఆరాధనా (both lines x2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (x2)Charanam 1
నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే
ఆరాధనా ఆరాధనా (both lines x2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (x2)Charanam 2
తన వాక్యముతో నను కాల్చిన యేసయ్యకే
ఆరాధనా ఆరాధనా (both lines x2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (x2)Charanam 3
తన రక్తములో నను కడిగిన యేసయ్యకే
ఆరాధనా ఆరాధనా (both lines x2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (x2)Akka's Testimony
Jayamu Jayamu
Pallavi
జయము జయము ప్రభు శ్రీ యేసు దేవా (x2)
జయము జయము ప్రభు ఇమ్మానుయేలా (x2)
జయము జయము ప్రభు శ్రీ యేసు దేవాCharanam 1
పాపుల కొరకై పరమును వీడి
భువికేతెంచిన దేవాది దేవా (both lines x2)
దయగన రావా దరిశనమీవా (x2)
సౌలునే పౌలుగా మార్చిన తండ్రివే (x2)
కనికరించి కాపాడుము దేవా
సర్వము నీవని నిన్నే నమ్మితినిCharanam 2
సజీవమైన రాళ్లవలెనుండి
ఆత్మ సంబంధమైన మందిరముగా (both lines x2)
నీదు కృపచే కట్టబడుచున్నాము (x2)
అది నీ వాక్యము సత్యమై నిలుచును
లేఖనమునందున వ్రాయబడియున్నది
అమూల్యమగు మూలరాయిని
సీయోనులో స్థాపించుచున్నాననిNenemina Prabuva
Pallavi
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (both lines x2)
నేనేమైయున్నానో నీ దయవలనేనయ్యా (x2)
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (x2)
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తానుCharanam 1
లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (both lines x2)
ఇచ్చిన నీవే బలికోరగా (x2)
తెచ్చి నీకు అర్పించినా
అబ్రాహాములాCharanam 2
సర్వం పోయిన శరీరం కృళ్ళిన
నాను వారే వెలివేసినా (both lines x2)
ఆప్తులంతా శత్రువులైనా (x2)
అంతము వరకు సహించినా
ఆ యోబులాCharanam 3
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైనా అది నాకెంతో మేలు (both lines x2)
ఇదిగో నేను ఉన్నానయ్యా (x2)
దయతో నన్ను గైకొనుమయా
నా యేసయ్యాEdarilo Selayerula
Pallavi
ఎడారిలో సెలయేరులా
నడిపించును నీ వాక్యముCharanam 1
నీ వాక్యమే నా పాదములకు దీపము (x2)
నీ వాక్యమే నా అడుగులను స్థిరపరచును (x2)
ఆ...Charanam 2
నీ వాక్యమే నా చీకటి బ్రతుకును మార్చెను (x2)
నీ వాక్యమే నా ప్రాణమునకు ఆధారము (x2)
ఆ...Charanam 3
నీ వాక్యమే నా హృదయములోన నిలుచుచున్నది (x2)
నీ వాక్యమే నాలోన పరిశుద్ధత పెంచుచున్నది (x2)Pavura Swaramu
Pallavi
పావుర స్వరము మన దేశములో
వినబడుచున్నది (both lines x2)Charanam 1
శాంతికి చిహ్నం పావురము
పరిశుద్ధాత్మ చిహ్నం పావురము (both lines x2)
దేశమా భయపడకుమా (x2)
దేశమా సంతోషించుమా (x2)Charanam 2
ఎక్కడ చూసిన ఘోరాలే
ఏ బ్రతుకైనా భారమే
మనిషిపై మనిషికి ద్వేషమే
దేశ దేశాలకి యుద్ధమే (these 4 lines x2)
లేదు మానవ జీవితానికి శాంతి (x2)
ఆదరణే కరువైపోయే లోకానికి (x2)
దేశమా భయపడకుమా
దేశమా సంతోషించుమా (both lines x2)Charanam 3
పావుర స్వరము బలమైనది
మహిమ ప్రభావము కలిగినది
పావుర స్వరము గర్జించును
ఆదరణే ఇచ్చును (these 4 lines x2)
హృదయమనే చెవులతో నీవు వినగలవా (x2)
జగమంతా నిండియున్న ఆ స్వరాన్ని
జగమంతా నిండియున్న క్రీస్తు స్వరాన్ని
దేశమా భయపడకుమా (x2)
దేశమా సంతోషించుమా (x2)Nakoka Tellangi
Pallavi
నాకొక తెల్లంగి (x2)
దైవ పిల్లలకు తెల్లంగి
నేను మోక్షం చేరాక
తెల్లంగి ధరించుకొని
చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా
మోక్షంలో ఆ మోక్షంలోCharanam 1
నాకొక వాయిద్యం (x2)
దైవ పిల్లలకు వాయిద్యం
నేను మోక్షం చేరాక
వాయిద్యం వాయించుకుంటూ
చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా
మోక్షంలో ఆ మోక్షంలోCharanam 2
నాకొక కిరీటం (x2)
దైవ పిల్లలకు కిరీటం
నేను మోక్షం చేరాక
కిరీటం ధరించుకొని
చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా
మోక్షంలో ఆ మోక్షంలో
Other albums

























