

गीत
Aathmaradhana
Pallavi
ఆత్మారాధన ఆత్మయైయున్న నా యేసుకే
సత్యముతో ఆరాధన సత్యమైయున్న నా క్రీస్తుకే (both lines x2)
హల్లెలూయా హల్లెలూయా (x2)
Charanam 1
యేసయ్యా నీ సింహాసనము యుగయుగాలు నిలుచును
నీ రాజదండము న్యాయమైనది నీవు నీతిని ప్రేమించితివి (both lines x2)
నీ పోలికలో నను చేసితివి నీ ఆత్మలో నను దాచితివి (x2)
Charanam 2
సర్వాధికారము గల రక్షకుడైన అభిషిక్తుడవు నీవే దేవా
నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు నీవే (both lines x2)
నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నవాడవు అనువాడవు (x2)Chaachina Chethulatho
Pallavi
సాచిన చేతులతో యేసు రమ్మని పిలిచెను
సాచిన తన చేతులతో యేసు రమ్మని పిలిచెను
కాదని పోబోకుమా నేడే యేసుని చేరవా (x2)
సాచిన తన చేతులతో యేసు రమ్మని పిలిచెనుCharanam 1
రేపేమి సంభవించునో అది నీకు తెలియదు
ఈనాడే యేసుని ప్రేమను హృదయములో నింపుకో (both lines x2)
ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము (x2)Charanam 2
మనమికను పాపులమై యుండగా యేసు మనలను ప్రేమించెను
యేసు కార్చిన రక్తములోనే మానవ పాప విమోచన (both lines x2)
యేసే జీవాహారం యేసే రక్షణ మార్గము (x2)Krottha bhumi
Pallavi
క్రొత్త భూమి కోసం క్రొత్త ఆకాశముల కోసం
ఎదురు చూచుచున్నాను వాటిలో యేసు నివసించును
ఆయనతో నేనుందును ఆయనతో మనముందుముCharanam 1
ఇప్పుడున్న ఈ ఆకాశాలు హోరుమని గతించిపోతాయి
పంచభూతాలు తీవ్రమైన వేడిమితో లయమైపోతాయి
భూలోకం దాని పనులు కాలిపోతాయి కాలిపోతాయిCharanam 2
దేవుని రాకడ కొరకు మనము ఓపికతో కనిపెట్టియుండాలి
ఆశతో ఆత్మతో పరిశుద్ధతను కాపాడుకోవాలి
భయముతోను భక్తితోను ఎదురుచూడాలి ఎదురుచూడాలిNaruni Andamantha
Pallavi
నరుని అందమంతయు
గడ్డి పువ్వు లాంటిదే
గడ్డి ఎండిపోవును
పువ్వు రాలిపోవును
నరుని అందమంతయుCharanam 1
శరీరము నశించును
ప్రాణము గతించును (both lines x2)
ఆత్మ ఒక్కటే నిలుచును
ఆత్మయే వాక్యము (both lines x2)Charanam 2
ఆదిలోన ఉన్నది
దివ్య జీవ వాక్యము (both lines x2)
యేసు ప్రభువే జీవము
ఆ జీవమే వాక్యము (both lines x2)Nee sthuthi geethi
Pallavi
నీ స్తుతి గీతి నే పాడనా
విరిగిన నలిగిన మనసు నీకియ్యనాCharanam 1
స్తుతి చేయుట యదార్థవంతులకు శోభస్కరము
ఉన్నవాడను అనువాడను స్తుతియించుటే మంచిది
నన్ను ప్రేమించి నాకై మరణించి నన్ను రక్షించిన నా యేసుCharanam 2
స్తుతిలోన నీ కృప దాచియుంచితివి నాకోసమేగా
కరుణ గల నీ నామము కీర్తింతును అనుక్షణం
నన్ను దీవించి నాలో జీవించి నాకై రానున్న నా యేసుSwaralu
స గ ప ద ని స స గ గ ప ప ద ద ని ని
స స ని ని ద ని ని ద ద ప ద ద ప ప గ గ ప ప ద ని ని స స గ గ ప ప ద ద ని ద ప ద
గ స స ని స స స ద ద ప ద ద ని ద ద గ ప ప గ స స గ ప ద
స స స గ గ గ ప ప గ గ గ ప ప ప ద ద ప ప ప ద ద ద ని ని ద ద ద ని ని ని స స
గ రి స స ని స ని స స రి స ని ని ద ని ద ని ని ని ద ప ప గ ప గ ప ప గ రి స స ని స ని స స
స స స ని ని ద ని ని ని ద ద ప ద ద ద ప ప గ ప ప ప గ గ స గ స స స ప గ గ గ ద ప ప ప ని ద ని స ద ని ప ద గ గ గ ద ప ప ప ని ద ద ద స ని స గ ని స ప ద ద ద స స స స ని ని ని ద ని ప స గ ప ద ని స ప ద ని స ప ద ని స ద ని సYedu suvarna
Pallavi
ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్యలో
సంచరించు మనుష్య కుమారుడా (both lines x2)
యేసు నీకే స్తోత్రం (x8)Charanam 1
పాదముల వరకు దిగుచున్న వస్త్రమును
ధరియించుకొని
రొమ్మునకు బంగారు పతకము
కట్టుకున్నవాడు (these 4 lines x2)
తలయు తలవెండ్రుకలు
తెల్లని ఉన్నిని పోలినవై (both lines x2)
హిమమంత ధవళముగా కలిగినవాడు (x2)
ఆ... ఆ... ఆ...Charanam 2
అగ్ని జ్వాలవలె నేత్రములు
అపరంజి వంటి పాదములు
జలప్రవాహముల ధ్వనివలె
కంఠస్వరము కలిగినవాడు (these 4 lines x2)
కుడిచేత ఏడు నక్షత్రములను
పట్టుకున్నవాడు (both lines x2)
రాజాధిరాజైన నా యేసు రాజు (x2)
ఆ... ఆ... ఆ...Charanam 3
రెండంచుల వాడియైన
ఖడ్గమును నోటినుండి
బయటకు విడుదల చేయువాడు
సర్వశక్తిగల నజరేయుడు (these 4 lines x2)
మహిమ కలిగిన తేజస్సుతో
ప్రకాశించు సూర్యునిలా
మహా మహిమ కలిగిన తేజస్సుతో
ప్రకాశించు సూర్యునిలా
వదనమును కలిగినవాడు (x2)
ఆ... ఆ... ఆ...Yesuni divya
Pallavi
యేసుని దివ్య చరితము
ఆత్మానంద భరితము
యేసుని ప్రేమ త్యాగము
ఊహలకందని నిజముCharanam 1
దేవుని స్వరూపము
కలిగినవాడు
దేవునితో సమానముగా
ఎంచబడినవాడు
మనిషి పోలికలో జన్మించి
దాసుని రూపము ధరియించి
తనను తానే రిక్తునిగా
చేసుకున్నవాడుCharanam 2
ఆయన ఆకారమందు
మనిషిగా కనబడి
సిలువలో మరణించునంతగా
విధేయతను చూపెను
అందువలన దేవుడు
యేసు నామమును హెచ్చించి
మూడు లోకాల జీవులలో
గొప్ప చేసినాడుCharanam 3
రక్తము చిందించకుండా
పాప క్షమాపణ లేదు
కోడెల గొర్రెల రక్తం
ఇవ్వలేదు క్షమాపణ
సిలువలో కార్చిన రక్తం
పాపము లేని రక్తం
యేసు సిలువలో కార్చిన రక్తం
పాపము లేని రక్తం
యేసుని రక్తములోనే
పాప క్షమాపణYesuni kosam
Pallavi
యేసు నీ కోసం జీవించు
యేసు నీ కోసం మరణించు (both lines x2)
యేసే ఇలలో దైవమని
నిర్భయముగా నువ్వు చాటించు (both lines x2)
యేసు నీ కోసం జీవించుCharanam 1
పాడే ప్రతి పాట
ప్రభు ప్రేమకు కావ్యం కావాలి
పలికే ప్రతి మాట
ప్రభు కరుణకు సాక్ష్యం కావాలి (these 4 lines x2)
చూసే ప్రతి చూపులో
అనురాగం నిండాలి
చేసే ప్రతి పనిలో
ప్రభు రూపం చూడాలిCharanam 2
ప్రభుని నమ్మినచో
ఉండవులే ఇలలో భేదాలు
అనుక్షణము ధ్యానిస్తే
పరలోకపు రాజ్యం మనదేలే (these 4 lines x2)
ప్రభు ఆజ్ఞలు పాటిస్తూ
జీవితమే సాగాలి
పాటించే ఆసక్తిని
ప్రభు మనకే ఇవ్వాలి
अन्य एल्बम

























