

गीत
Mahimagala Raja
Pallavi
మహిమ గల రాజా నా యేసు
మహిమ గల రాజా (both lines x2)
సర్వోన్నతమైన స్థలములలో (x2)
నీకే మహిమ నీకే మహిమ (x2)
మహిమ మహిమ నా యేసుకే
మహిమ మహిమ నా క్రీస్తుకే (both lines x2)
మహిమ గల రాజా నా యేసు
మహిమ గల రాజాCharanam 1
నన్ను ప్రేమించి నీ రక్తము చేత
నా పాపము నుండి విడిపించినావు
అవధులు లేని నీ కృప చేత
నీలో నన్ను బంధించినావు (these 4 lines x2)
సాగిల పడెదను యుగయుగములు
ఆ... ఆ...
సాగిల పడెదను యుగయుగములుCharanam 2
లెమ్ము నీవు తేజరిల్లుమని
నీ మహిమ నా మీద ఉదయింప చేసావు
అన్యజనములు నీ వెలుగునకు
వచ్చెదరని నను ఆశీర్వదించావు (these 4 lines x2)
ప్రకాశింతును నీ మహిమలో
ఆ... ఆ...
ప్రకాశింతును నీ మహిమలోStuthi tho
Pallavi
స్తుతితో ప్రారంభించెదను
నా నూతన దినమును
హృదయములో ప్రతిష్ఠించెదను
నా క్రీస్తుని ప్రభువుగా (these 4 lines x2)
హల్లెలూయ అని పాడెదను
ఆనందముతో కీర్తింతును (both lines x2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (x4)Charanam 1
నేను నీ బలము వలన సంతోషించుచున్నాను
నీ రక్షణ వలన ఎంతో హర్షించుచున్నాను (both lines x2)
నా మనోభీష్టమును నీవు సఫలము చేయుదువు
నా ప్రార్థన మానక అంగీకరించెదవు (both lines x2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (x4)Charanam 2
నేను నా క్రీస్తులోనే నమ్మిక యుంచియున్నాను
సర్వోన్నతుడా నీ కృపలోనే కదలక నిలిచెదను (both lines x2)
నీ మహిమ సన్నిధిలో సదాకాలము జీవింతును
నీ ఆలయంలో ఒక స్తంభముగా ఉండెదను (both lines x2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (x4)Yehova Athma
Pallavi
యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు
ఆయన వాక్కు నా నోట ఉన్నది (both lines x2)Charanam 1
ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను
మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను (both lines x2)
వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత (x2)
భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను
అతడు ఉండును అతడు ఉండును (x2)Charanam 2
ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే
అది స్థిరమాయెను దేవునికి పూర్ణానుకూలము (both lines x2)
అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది (x2)
నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును
నెరవేర్చును నెరవేర్చును నెరవేర్చునుBalamina Namamu
Pallavi
బలమైన నామము యేసయ్య నామము (x2)
శక్తి గల నామం ముక్తి గల నామం (x2)
విముక్తినిచ్చు నామము యేసు నామము (x2)Charanam 1
లోకానికి వెలుగైన నామము
పరలోకానికి నడిపించే నామము (both lines x2)
సాతానుని బంధించే నామము
రోగాలను పోగొట్టే నామము (both lines x2)Charanam 2
లోకమును ప్రేమించిన నామము
లోకమును జయించిన నామము (both lines x2)
పాపమును పరిహరించు నామము
ప్రభువైన యేసుక్రీస్తు నామము (both lines x2)Charanam 3
రక్తమును చిందించిన నామము
రిక్తునిగా చేసుకున్న నామము (both lines x2)
రక్షణను అందించిన నామము
అన్ని నామముల కన్న పై నామము (both lines x2)Intha varaku
Pallavi
ఇంతవరకు సహాయపడిన దేవుడు
ఇకపై ఎందుకు విడనాడతాడు (both lines x2)
బెదరనీకు నీ గుండెను
చెదరనీకు విశ్వాసము
అన్ని సమయాలలో క్రీస్తుని స్తుతియించుము
ఇంతవరకు సహాయపడిన దేవుడు
ఇకపై ఎందుకు విడనాడతాడుCharanam 1
నిన్ననుసరించు వారిని సరిచేయు వాడవు
సాధించలేని దానిని నాకిచ్చు వాడవు (both lines x2)
నా బాధలలో ఆవేదనలో (x2)
నీ చేతులు చాచి కౌగిట చేర్చిన కాపరివిCharanam 2
గాయపడిన నా హృదయము మౌనము నిండి ఒక వేళలో
కలతల కెరటం నా పైన పొర్లి పారింది పెను గాలితో (both lines x2)
నా గుండెలలో నీ వాగ్దానం (x2)
వినిపించిన నీ కృప ప్రేమ స్వరము ఎనలేనిదిNaa Deva
Pallavi
నా దేవా నా దేవా
నీవు నన్నేల విడనాడితివి
నను రక్షింపక నా ఆర్తధ్వని వినక (x2)
నీవేల దూరముగా ఉన్నావు (x2)
నా దేవాCharanam 1
నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను
రాత్రివేళను నేను మౌనముగా ఉండుట లేదు (both lines x2)
అయినను అయినను
అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు
ఉత్తరమియ్యకున్నావుCharanam 2
గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కాదా
నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా (both lines x2)
నీవే కాదా నీవే కాదా
నీవే కాదా నాకు నమ్మిక పుట్టించితివి
నాకు నమ్మిక పుట్టించితివిYesaiah Nee Prema
Pallavi
యేసయ్య నీ ప్రేమ మాటలను
మనసార నే పాడి కీర్తింతును (both lines x2)
నా ఆత్మలో నీ గీతము
పరవళ్ళుగా ప్రవహించెను (both lines x2)
యేసయ్య నీ ప్రేమ మాటలను
మనసార నే పాడి కీర్తింతునుCharanam 1
మదిలోన నీ రూపమే నిలిచెను
హృదయాన నీ పాటలే మ్రోగెను (both lines x2)
తొలి సంధ్యలో కిరణాలలా
నీ చూపులే నను తాకెను (both lines x2)Charanam 2
నీ ఆలయములోన నీ కృపను
విరిగిన మనసుతో ధ్యానించితిని
నీ ఆలయములోన నీ కృపను
నలిగిన మనసుతో ధ్యానించితిని
నీ నామము బలమైనది
నీ చేతిలో నీతి ఉన్నది (both lines x2)
अन्य एल्बम

























