

गीत
Mahima Mahima
Pallavi
మహిమ మహిమ (x4)
యేసు రాజా నీకే స్తోత్రం
ప్రాణ నాధా నీకే మహిమ (both lines x2)Charanam 1
దివి నుండి నా కోసం
దిగి వచ్చిన ప్రాణ ప్రియుడా (both lines x2)Charanam 2
హృదయ రాగం వినిపించి
నను మలచిన హృదయ శిల్పి (both lines x2)Charanam 3
నీ ప్రేమకు సూచనగా
బలి ఐతివి నా కోసం (both lines x2)Charanam 4
నరులందరిని కన్నులారా
చూచుచున్న మహా దేవా (both lines x2)Ending
హల్లెలూయా హల్లెలూయా (x4)Nee Swarame
Pallavi
నీ స్వరమే
స రి గ మ ప ద ని స లై
నా జీవిత శ్రుతిని తెలిపింది (these 3 lines x2)
నీ జీవితమే యేసూ
నా నడతకు లయగా నిలిచింది (both lines x2)
నీ స్వరమే
స రి గ మ ప ద ని స లై
నా జీవిత శ్రుతిని తెలిపింది (these 3 lines x2)Charanam 1
నీ స్వరమే సృష్టిని కలిగించెను
నీ స్వరమే మృతులను బ్రతికించెను (both lines x2)
నీ స్వరమే కఠినులను మార్చెను
ఆ స్వరమే నను పిలచి రక్షించెను (both lines x2)Charanam 2
నీ జీవితమే సంగీతము
నీ జీవితమే సాహిత్యము (both lines x2)
నీ జీవితమే ఇల సమస్తము
ఆ జీవితమే నా గమ్యము (both lines x2)Paapulalo pradhana
Pallavi
పాపులలో ప్రధాన పాపిని నేనయ్యా
అయినా యేసయ్య నీ కృప రక్షించలేనంత పాపిని కానయ్యా
పాపమును ద్వేషించే యేసయ్యా నీకే స్తోత్రం
పాపిని ప్రేమించే మెస్సయ్యా నీకే మహిమ
నీకే మహిమCharanam 1
ఎంత వెదకినా నాలో ఏ మంచి కనబడదయ్యా
తరచి చూసినా నీలో ఏ దోషం కనుగొనలేమయ్యా
కానీ యేసయ్య నీవు నేను ఒకటేనన్నావు (x2)Charanam 2
చేయకూడదని అనుకున్నవన్నీ చేయుచున్నాను
చేయాలనుకుని తలచినవన్నీ చేయలేకున్నాను
నీ ఆత్మ నియమము ఒకటే నన్ను ఈ స్థితి నుండి విడిపించెను (x2)Prardhane Jayammura
Pallavi
ప్రార్థనే జయమ్మురా
ప్రార్థనే విజయమ్మురాCharanam 1
క్రైస్తవ జయ జీవితముకు ప్రార్థనే ఆయుధం
ఇది గుర్తించిన వారు మరి ధన్యులుCharanam 2
చేతులెత్తి ప్రార్థించెను మోషే భక్తుడు
గుడారములో ప్రార్థించెను యెహోషువCharanam 3
ఆసక్తితో ప్రార్థించెను ఏలీయా ప్రవక్త
అత్యాసక్తితో ప్రార్థించెను సంఘమంతాCharanam 4
పట్టుదలతో ప్రార్థించెను ఎస్తేరు రాణి
ఆత్మ క్రుమ్మరించి ప్రార్థించెను హన్నాCharanam 5
కన్నీటితో ప్రార్థించెను హిజ్కియా రాజు
ఉపవాసముండి ప్రార్థించెను యెహోషాపాతుCharanam 6
సర్వ శరీరులు యేసయ్య యొద్దకు
రావాలంటే ప్రార్థనే కావాలిSatyamaina Deva
Pallavi
సత్యమైన దేవా పవిత్రమైన దేవా
గువ్వల వంటి నేత్రములు
కలిగిన యేసయ్యా
నీకే నీకే స్తుతి స్తోత్రము
నీకే నీకే ప్రభావముCharanam 1
సకల యుగములలో శాశ్వతమైన రారాజువు
అగోచరుడవైన ఏకైక సత్య దేవుడవుCharanam 2
పూర్ణ హృదయముతో యేసయ్య నిన్నే స్తుతియింతును
పూర్ణాత్మతో మెస్సయ్య నిన్నే కీర్తింతునుCharanam 3
అడుగు వాటికంటే ఊహించు వాటికంటే
అత్యధికముగా మాకు ఇచ్చేవాడవు నీవే యేసయ్యUnnavu Naalo Unnavu
Pallavi
ఉన్నావు నాలో ఉన్నావు
నాతో ఉన్నావు
నను విడువను అన్నావు
యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం
మెస్సయ్యా నీకే ఆరాధనCharanam 1
కష్టాలలో నీవు ఉన్నావు
కన్నీటిలో నీవు ఉన్నావు (both lines x2)
శోధనలో నీవు ఉన్నావు
వేదనలో నీవు ఉన్నావుCharanam 2
ఆకాశాన నీవు ఉన్నావు
ఆలయాన నీవు ఉన్నావు (both lines x2)
అణువణువున నీవు ఉన్నావు
ఆత్మ రూపియై ఉన్నావుCharanam 3
నా హృదయంలో ఉన్నావు
నా తలపులలో ఉన్నావు (both lines x2)
నా ఊహలలో ఉన్నావు
నా మనసును కనుగొన్నావుVadhu varulu challaga
Pallavi
వధువరులు చల్లగా ఉండాలి
శ్రీ యేసుని కృపలో (both lines x2)
వధువరులు చల్లగా ఉండాలిCharanam 1
తండ్రియైన దేవుని ప్రేమ మీలోన నివసించాలి (x2)
ఆ ప్రేమ కలిగిన వారై అనేకులను బలపరచాలి (x2)Charanam 2
ధనాపేక్ష లేని వారై కలిగియున్న వాటితోనే (x2)
తృప్తిగా జీవించాలి ధైర్యముగా నివసించాలి (x2)Charanam 3
ప్రార్థనే ఊపిరిగా వాక్యమే ఖడ్గముగా (x2)
పరిశుద్ధ మందిరాలుగా కలకాలం కలిసి ఉండాలి (x2)Vistharamaina
Pallavi
విస్తారమైన నీ కృపలో నను నిర్ణయించావు
వివరించలేని నీ ప్రేమతో నన్ను పిలిచావు (both lines x2)
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...
నీ నీతిని నాకిచ్చావు నీ మహిమలో నను దాచావు (x2)
విస్తారమైన నీ కృపలో...Charanam 1
ఎటుబోయినా శ్రమపడుచున్నా ఇరికింపబడకుండా కాపాడుచున్నావు
నీ జీవము నా శరీరమందు కనబడే వరకు నను విడువనన్నావు (both lines x2)
నీవే నాకు తోడన్నావు (x2)
విస్తారమైన నీ కృపలో నను నిర్ణయించావు
వివరించలేని నీ ప్రేమతో నన్ను పిలిచావు (both lines x2)
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...
నీ నీతిని నాకిచ్చావు నీ మహిమలో నను దాచావు (x2)
విస్తారమైన నీ కృపలో...Charanam 2
నీ సన్నిధిలో నాట్యమాడుచు నిందారహితునిగా ఉండమన్నావు
నీవు నాతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని ప్రేమతో పలికావు (both lines x2)
ఆత్మే నాకు ఆదరణన్నావు (x2)
విస్తారమైన నీ కృపలో నను నిర్ణయించావు
వివరించలేని నీ ప్రేమతో నన్ను పిలిచావు (both lines x2)
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...
నీ నీతిని నాకిచ్చావు నీ మహిమలో నను దాచావు (x2)
విస్తారమైన నీ కృపలో...Yesayyaaa Naapai
Pallavi
యేసయ్యా నాపై ఎందుకయ్యా ఇంత ప్రేమ (x2)
నిన్ను దూషించినందుకా
నిన్ను మాహాటముగా సిలువ వేసినందుకా (both lines x2)
యేసయ్యా నాపై ఎందుకయ్యా ఇంత ప్రేమCharanam 1
ఎన్ని మారులో నిన్ను నేను తృణీకరించాను
నన్ను పిలచిన నీ పిలుపును నే నిరాకరించాను (both lines x2)
విడువని నీ కృప నాపై చూపి ప్రేమించుచున్నావు (x2)Charanam 2
నీ రక్తము చేత నా పాపమును పరిహరించావు
మరణపు ముల్లును విరిచివేసి జీవమునిచ్చావు (both lines x2)
విస్తారముగా నీ కృప నాపై కుమ్మరించావు (x2)
अन्य एल्बम

























