

गीत
Pradhana Aalakinchuvada
Pallavi
ప్రార్థన ఆలకించువాడా నా యేసు రాజా (x2)
నీ నామమునే స్తుతియించెదను
నీ గానమునే కీర్తించెదను (both lines x2)
సని దని సని దప మద పమ గరి గమ ప
ప్రార్థన ఆలకించువాడా నా యేసు రాజాCharanam 1
యుక్తమైన ప్రార్థన నేర్పుము ఆత్మ దేవా (x2)
ఎడతెగని ప్రార్థనలో ఆ ఆ
ఎడతెగని ప్రార్థనలో
నను నడిపించుము సత్య దేవా (x2)
సని దని సని దప మద పమ గరి గమ పCharanam 2
ఆసక్తికరమైన ప్రార్థన అనుగ్రహించుము కృపగల దేవా (x2)
ప్రార్థనలో పోరాటము ఆ ఆ
ప్రార్థనలో పోరాటము
కలిగియుండే శక్తినివ్వు (x2)
సని దని సని దప మద పమ గరి గమ పNaa Kannula Neere Lekunte
Pallavi
నా కన్నుల నీరే లేకుంటే
యేసయ్యా నీ ఓదార్పే లేదు కదా (both lines x2)
నా బ్రతుకునకు అలసటే లేకుంటే (x2)
యేసయ్యా నీ ఆదరణే లేదు కదా (x2)
నా కన్నుల నీరే లేకుంటే
యేసయ్యా నీ ఓదార్పే లేదు కదాCharanam 1
నా బ్రతుకులోన కష్టాలనేవి ఉన్నాయని అనుకున్నానో
నా మనసులోన వేదనలెన్నో ఉన్నాయని తలపోశానో (both lines x2)
తీరా ఆలోచిస్తే
అవి నీ ప్రేమకు గుర్తులే కదా (both lines x2)Charanam 2
నా జీవన ప్రవాహం ఎటుపోవునో అని ఎన్నో మారులు భయపడ్డానో
ఈ చిన్ని పడవ గమ్యమేమిటో అని విచార వదనముతో జీవించానో (both lines x2)
తీరా ఆలోచిస్తే
యేసయ్య పాదాల చెంతకే కదా
తీరా నేనాలోచిస్తే
నా యేసయ్య పాదాల చెంతకే కదాNaa Nirasa Nispruhalo
Pallavi
నా నిరాశ నిస్పృహలో
నను వెంబడించిన ఆ శోధనలో (both lines x2)
నీ కృప వెంబడి కృపలో
నను విడిపించిన దేవుడవు
నీ కృప వెంబడి కృపలో
నను ఆశీర్వదించిన తండ్రివి
యేసయ్యా నా యేసయ్యా
అందుకే ఈ ఆరాధన (both lines x2)Charanam 1
నా హృదయములోని తలంపులలోని ఊహ అంతయు
ఎల్లప్పుడు కేవలము చెడిపోయి యుండగా (both lines x2)
నీ కృపలోని శక్తి చేత (x2)
నను పవిత్రపరచిన దేవుడవు
నను పరిశుద్ధపరచిన తండ్రివిCharanam 2
జ్ఞానము లేని వెర్రివాడను ఎన్నుకున్నావు
నీ సన్నిధిలో స్తుతిని యాగముగా చేయుటకై (both lines x2)
నీ కృపలోని మహిమ చేత (x2)
నను మహిమపరచిన దేవుడవు
నాకు జయమునిచ్చిన తండ్రివిNee Prema Aacharyame
Pallavi
నీ ప్రేమ ఆశ్చర్యమే
నీ కరుణ ఆనందమే (both lines x2)
నీ మహిమ సంతోషమే
నీ ఆత్మ అభిషేకమే (both lines x2)
నీ ప్రేమ ఆశ్చర్యమే
నీ కరుణ ఆనందమేCharanam 1
నా బాధలన్నిటిలో
నను విడిపించినావు యేసయ్యా (both lines x2)
నా కష్టకాలములో
నడిపించినావు మెస్సయ్యా
నా కష్టకాలములో
నను నడిపించినావు మెస్సయ్యాCharanam 2
ఆశగల ప్రాణమును
తృప్తిపరచినావు యేసయ్యా (both lines x2)
ఆకలిగొనిన వారి ప్రాణమును
మేలుతో నింపావు మెస్సయ్యా (both lines x2)Nirantaramu Niluchunu
Pallavi
నీ కృప నిరంతరం నిలుచును నీ కృప
తరాలను కాచును ఆ కృప
అందుకే యేసయ్యా నీకు స్తుతులు చెల్లింతునుCharanam 1
నీ కృప నిరంతరం నిలుచునని
నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు పలికెదరు
నీ కృప నిరంతరం నిలుచునని
అహరోను వంశస్థులు పలికెదరు
నీ కృప నిరంతరం నిలుచునని
నీ యందు భయభక్తులు గలవారు పలికెదరుCharanam 2
నీ కృప నిరంతరం నిలుచునని
నీ రక్తములో కడిగిన వారు పలికెదరు
నీ కృప నిరంతరం నిలుచునని
సమస్త ప్రజలు సంతోషముతో పలికెదరు
నీ కృప నిరంతరం నిలుచునని
నీ యందు భయభక్తులు గలవారు పలికెదరుముగింపు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాHechimpa taginavada
Pallavi
హెచ్చింపదగినవాడా
పూజ్యనీయుడా (both lines x2)
స్తుతియింపదగినవాడా
నన్నేలు రాజా యేసయ్యా (both lines x2)
హెచ్చింపదగినవాడా
పూజ్యనీయుడా
ఆమెన్ ఆమెన్ హల్లెలూయా (x6)Charanam 1
శాశ్వతమైన నీ ప్రేమను
వర్ణింప తరమా నా జీవితాన (both lines x2)
కొనియాడెదను కీర్తించెదను (x2)
లక్ష్యము కలిగి జీవించెదను
ఒక లక్ష్యము కలిగి జీవించెదనుCharanam 2
విడువని ఎడబాయని నీ కృప
నాకు చాలును యేసయ్యా (both lines x2)
మంచి దేవుడా మహోన్నతుడా (x2)
మారని వాడా మహనీయుడా (x2)Aa turupu Desamulo
Pallavi
ఆ తూర్పు దేశములో రాత్రి వేళలో
గొర్రెల కాపరులు మందను కాయగా
Happy Happy Christmas Merry Merry ChristmasCharanam 1
ఒక దూత నిలిచెను ప్రభువు మహిమ
ప్రకాశించెను వారు భయపడిరి
Happy Happy Christmas Merry Merry ChristmasCharanam 2
అయితే ఆ దూత భయపడకండని చెప్పి
సువర్తమానము చెప్పెద నేననెను
Happy Happy Christmas Merry Merry ChristmasCharanam 3
దావీదు పట్టణములో రక్షకుడు మీ కొరకు
పశువుల పాకలో జన్మించియున్నాడు
Happy Happy Christmas Merry Merry ChristmasCharanam 4
ఆయనే యేసయ్య ప్రభువైన మెస్సయ్య
లోక పాపములు పారిపోయెను
Happy Happy Christmas Merry Merry Christmas
अन्य एल्बम

























